
సమస్యలపై అలుపెరుగని పోరాటం
తాండూరు టౌన్: విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం చేస్తామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక శాలివాహన డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ పారా మెడికల్ కళాశాలల్లో విద్యార్థి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్, హాస్టళ్లలో వసతుల కల్పన, విద్యార్థి సంక్షేమం, హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్