
రేషన్.. సంబురం
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కొత్త కార్డులకు బియ్యం కోటా మంజూరు
● మొదటిసారి సరుకులుతీసుకున్న లబ్ధిదారులు
● సంతోషం వ్యక్తం చేసిన కార్డుదారులు
● సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు
కొడంగల్ రూరల్: మొదటిసారి బియ్యం తీసుకుంటున్న సూర్యప్రకాష్
వికారాబాద్: దశాబ్ద కాల నిరీక్షణ ఫలించింది. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులకు ఈ నెల కోటా కేటాయించారు. ఒకటో తేదీ నుంచి కొత్త లబ్ధిదారులు రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారు. మొదటి సారి బియ్యం పొందడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. పదేళ్లపాటు నిరీక్షించిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. మర్పల్లి మండలానికి కొత్తగా 1,250 ఆహారభద్రత కార్డులు మంజూరయ్యాయి. 4,040 మందికి ఆరు కిలోల చొప్పున 24,240 కేజీల బియ్యం కోటా కేటాయించారు. ధారూరు మండలానికి కొత్తగా 836 రేషన్ కార్డులు మంజూరు కాగా 5,016 కిలోల బియ్యం కేటాయించారు. కొడంగల్ మండలానికి కొత్తగా 1,243 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. దుద్యాల్ మండలానికి కొత్తగా 1,352 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. గురువారం పలువురు లబ్ధిదారులు మొదటిసారి రేషన్ బియ్యం తీసుకున్నారు.