
‘పాంబండ’ను అభివృద్ధి చేస్తాం
కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో వెలసిన శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ కృష్ణతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో కేబుల్ బ్రిడ్జి, కొత్త భవనాలు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. పాంబండకు పర్యాటక శోభను తీసుకువస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మైపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, బ్లాక్ బీ అధ్యక్షుడు భరత్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి