
బెస్ట్ టీచర్‌్స
అబ్దుల్లాపూర్‌మెట్: బండరావిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.రమాదేవి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 2002లో మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం హరిజన్‌వాడ యూపీఎస్‌లో తొలిసారి ఆమె విధుల్లో చేరారు. 2013లో మండల స్థాయిలో.. 2018లో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. 2019లో బెస్ట్ రిజల్ట్స్ సాధించిన టీచర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. 2020లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని రమాదేవి పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయిలో..
చేవెళ్ల: మున్సిపల్ పరి ధిలోని దామరగిద్ద ప్రా థమి కోన్నత పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కె.బాలాజీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 25 ఏళ్లుగా బోధనా వృత్తిలో కొనసాగుతున్న ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎంఆర్‌పీ, డీఆర్‌ఎపీ, ఎస్‌ఆర్‌పీగా బాధ్యతలు నిర్వర్తించారు.
తాండూరు రూరల్: తాండూరు మండలం నుంచి ఆరుగురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో స్థానం దక్కించుకున్నారని ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. వీరిలో గౌతపూర్ పాఠశాల హెచ్‌ఎం లీలావతి, మల్కాపూర్ హెచ్‌ఎం బాబ్యానాయక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దుమీడియం ఉపాధ్యాయురాలు ఆరాధన, జినుగుర్తి హైస్కూల్ టీచర్ నాగరాజు, కేజీబీవీ టీచర్ బాలమణి, జినుగుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో పీఈటీ బుగ్గప్ప ఉన్నారు.
హుడాకాంప్లెక్స్: విక్టోరియా మెమోరియల్ పాఠశాలలో పనిచేస్తున్న కళావతి ఉత్తమ టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాది వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాసుపల్లి గ్రామం. తండ్రి పాండు రంగారావు రైల్వేలో స్టేషన్ మాస్టారు. అమ్మ రత్నమ్మ గృహిణి. నేను 1993లో కేంద్రియ విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా చేరా. అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.
ధారూరు: మండలం నుంచి ముగ్గురు టీచర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ధారూరు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న లక్ష్మీనర్సమ్మ, మోమిన్‌కలాన్ ప్రాథమిక పాఠశాల టీచర్ శ్రీనివాస్, నాగసమందర్ పీఎస్ ఉపాధ్యాయురాలు సరిత ఉన్నారు.
కుల్కచర్ల: స్థానిక ప్రాథమిక పా ఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉప్పరి రమేశ్ జిల్లా ఉత్తమ టీచర్‌గా ఎంపికయ్యారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంపిక
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలువురు టీచర్లకు అవార్డులు ప్రకటించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బెస్ట్ టీచర్లుగా ఎంపికయ్యారు.

బెస్ట్ టీచర్‌్స

బెస్ట్ టీచర్‌్స

బెస్ట్ టీచర్‌్స

బెస్ట్ టీచర్‌్స