
యూరియా లారీ పట్టివేత
30 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు గుర్తింపు
పరిగి: యూరియా లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగాపూర్ శివారు బీజాపూర్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉండటంతో పోలీసులు తనిఖీ చేశారు. అందులో యూరియా ఉండటంతో స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏడీఏ లక్ష్మీకుమారి ఘటన స్థలానికి చేరుకుని యూరియాను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. ఇది వ్యవసాయానికి సంబంధించినదా, లేకుంటే పరిశ్రమల యూరియా అనే పరీక్షిస్తామని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యూరియా లారీ పట్టివేత