సీఎంను కలిసిన బొంరాస్‌పేట నాయకులు | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన బొంరాస్‌పేట నాయకులు

Sep 5 2025 8:30 AM | Updated on Sep 5 2025 8:30 AM

సీఎంన

సీఎంను కలిసిన బొంరాస్‌పేట నాయకులు

సీఎంను కలిసిన బొంరాస్‌పేట నాయకులు లడ్డూ @2.25 లక్షలు నైట్‌ షెల్టర్‌కు మరమ్మతులు చేయండి లంబాడీలపై అసత్య ప్రచారం తగదు

బొంరాస్‌పేట: మండలానికి చెందిన పలువురు నాయకులు, అధికారులు గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని నగరంలో కలిశారు. మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు గురించి సీఎంకు వివరించినట్లు కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఈజీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నర్సింలుగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, నాయకులు వెంకట్రాములు గౌడ్‌, జయకృష్ణ, మల్లేశ్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ వెంకన్నగౌడ్‌, ఎంపీఓ రవి తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలో ప్రతిష్ఠించిన వినాయడి విగ్రహాలను గురువారం ప్రశాంతంగా నిమజ్జనం చేశారు. ఉదయం ప్రత్యేక పూజలు అర్చనలు, అన్నదానాలు చేపట్టారు. అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. పట్టణంలోని ఆలంపల్లి పంచముఖ హనుమాన్‌ ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను రూ.2.25 లక్షలకు లంకాల పెద్ద నరసింహారెడ్డి దక్కించుకున్నారు. మరో లడ్డూను గుడాటి రోజాశ్రీనాథ్‌రెడ్డి రూ.1.57 లక్షలకు, ధన్నారం హనుమాన్‌ మందిరంలో చిట్యాల వెంకట్రామ్‌రెడ్డి రూ.1.12 లక్షలకు.. ఎన్నెపల్లిలో మాజీ కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి రూ. 81వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణ పరిధిలోని కుక్కల జనన నియంత్రణ కేంద్రాన్ని, నగర వాటిక, నైట్‌ షెల్టర్‌ను గురువారం మెప్మా స్టేట్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుజాత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైట్‌ షెల్టర్‌కు మరమ్మతులు చేసి వెంటనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం శివరాంనగర్‌ కాలనీలో మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొని గ్రూపులు ఏ విధంగా కొనసాగుతున్నాయనే విషయంపై ఆరా తీశారు. ఆమె వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, మెప్మా పీడీ రవి, టౌన్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ వెంకటేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఏసుదాసు, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌ నాయక్‌

పరిగి: లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఆయా పార్టీల నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలో గిరిజన సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే లంబాడీలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని రిట్‌ పిటీషన్‌ వేయడం సరికాదన్నారు. తమ జోలికి వస్తే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.

సీఎంను కలిసిన  బొంరాస్‌పేట నాయకులు 1
1/2

సీఎంను కలిసిన బొంరాస్‌పేట నాయకులు

సీఎంను కలిసిన  బొంరాస్‌పేట నాయకులు 2
2/2

సీఎంను కలిసిన బొంరాస్‌పేట నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement