
పనులు వేగిరం చేయండి
చేవెళ్ల: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే అండర్, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల ప్రగతిపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రైల్వే అధికారులతో మంగళవారం చర్చించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజ్‌య్‌కుమార్ శ్రీవాత్సవ, డీజీఎంలు ఉదయనాథ్, మల్లాది శ్రీనివాస్, సీపీఆర్‌ఓ శ్రీధర్‌లతో సమావేశమయ్యారు. శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌ను అధునికీకరించాలని, మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్‌యూబీ నిర్మించాలన్నారు. నావంధ్గీ రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ నిలపాలని కోరారు. వికారాబాద్–తాండూర్ మార్గంలో కోర్టు సమీపంలో రైల్వే ట్రాక్‌పై, రామయ్యగూడ వద్ద నిర్మించే ఆర్‌ఓబీల పనుల వేగిరానికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రైల్వే స్టేషన్‌లలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లను నిలపాలని కోరామన్నారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
రైల్వే అధికారులను కోరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి