
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
కేసీఆర్‌పై కుట్ర తగదు
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్
పూడూరు: కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ పిలుపు మేరకు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, మాజీ చైర్మన్ ముకుంద అశోక్, రాష్ట్ర నాయకులు కొప్పుల అనీల్‌రెడ్డితో పాటు నిరసన చేస్తున్న పలువురు నాయకులను పరిగిలో అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే అక్రమ అరెస్టులు ఏమిటని ప్రశ్నించారు. అరెస్టు విషయం తెలుసుకున్న ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూడూరు మాజీ ఎంపీపీ మల్లేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, సొసైటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహారెడ్డి, నాయకులు వెంకటయ్య, ప్రవీణ్‌కుమార్, సదానందం గౌడ్, జాహెద్, మైపాల్‌రెడ్డి, రహీస్‌ఖాన్, నర్సింలు, హరీశ్వర్‌రెడ్డి, సతీష్‌పంతులు, తాజొద్దీన్, శ్రీనివాస్‌గౌడ్, కోట్ల శంషు, అశోక్‌గౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కక్ష సాధింపే: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకట్
మోమిన్‌పేట: కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు. హరిశంకర్, అంజయ్య, మల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, శ్రీరాంలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుట్రే..
నవాబుపేట: బీఆర్‌ఎస్‌ను అణగదొక్కాలనే కుట్రతోనే కాంగ్రెస్, బీజేపీలు కాలేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దయాకర్ రెడ్డి, విజయ్ కుమార్, శాంత్ కుమార్, పురుషోత్తం, మహేష్ రెడ్డి, ఆఫ్సర్ ఖాన్, సుధాకర్, దాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నిరసన ర్యాలీ
బంట్వారం: కోట్‌పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కక్ష్య సాధింపు రాజకీయాలు మానుకోని పరిపాలనపై దృష్టిపెట్టాలన్నారు. అన ంతరం యూరియా కొరతపై తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, సర్పంచ్‌ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్, మా జీ ఏఎంసీ చైర్మన్ మహేందర్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
కాళేశ్వరం పేరిట కాంగ్రెస్ డ్రామాలు: శ్రీశైల్‌రెడ్డి
తాండూరు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నిరసనగా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, వీరేందర్, నర్సిరెడ్డి, నాయకులు నర్సింలు, శ్రీనివాసచారి, సందల్‌రాజుగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శోభారాణి, శకుంతల న్నారు.
రోడ్డు బైఠాయింపు
ధారూరు: కాళ్లేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై సీబీఐ విచారణకు అప్పగించవద్దని, అరెస్టు చేసిన నాయకులను వదిలేయాలని మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధారూరులో తాండూర్–హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాములు, చెన్నయ్య, ఎ. అంజయ్య, బాల్‌రాజ్‌నాయక్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
మోమిన్‌పేటలో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
తాండూరు: ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి