
తెలుగు పద్యంతో సృజనాత్మకత
అనంతగిరి: తెలుగు పద్యం విద్యార్థులకు ఏకాగ్రత, సుజనాత్మకతను పెంచుతుందని ప్రముఖ శతావధాని, సాహితీవేత్త డాక్టర్ మలుగ అంజయ్య అన్నారు. వికారాబాద్‌లోని డైట్ కళాశాలలో తెలుగు భాషోపాధ్యాయుల శిక్షణ కేంద్రంలో పద్య వైభవం అనే అంశంపై శుక్రవారం ఆయన విస్తృత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు పద్యం క్రీ.శ 6వ శతాబ్దం నుంచి ఉన్నదని, నన్నయ కాలం మహాభారతం తరువాత లయబద్ధమైన పద్యం వచ్చిందన్నారు. పద్యంలో కావ్యాలు, శతకాలు, ఖండ కావ్యాలు, రామాయణ, భారత భాగవతాలు తెలుగు భాషలో వచ్చాయన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత పెంచడానికి పద్యం ఉపయోగపడుతుందన్నారు. ఒకనాటి కవులు సాహితీ లోకంలో పద్యమే ప్రాణంగా భావించారన్నారు. కార్యక్రమంలో శిక్షణ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ మున్నూరు రాజు, సెక్టోరియల్ ఆఫీసర్ రజిత, డీఆర్పీలు సుధాకర్ గౌడ్, ఎన్నారం శ్రీనివాస్, ఘనపురం పరమేశ్వర్, రాజ్ కుమార్, శేఖర్, బుర్రి శేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి
దుద్యాల్: ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, ప్రతి రోజు కొత్త విషయం తెలుసుకోవాలని ఉపాధ్యాయ జిల్లా రిసోర్స్ పర్సన్ వీరేశం గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వీరేశంగౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే అని గుర్తు చేశారు. అందుకు తగినట్టుగా తరగతి బోధన ఉండాలని సూచించారు. అనంతరం మండల విద్యాధికారి విజయరామారావు మాట్లాడుతూ విద్యార్థుల ఆసక్తి గుర్తించి వారికి తగిన విధానంలో బోధన చేయాలని.. ఉపాధ్యాయుడి భోదన, భాష విద్యార్థిని ఆకట్టుకునేట్టుగా ఉండాలని సూంచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ గౌడ్, వెంకటయ్య, సంపత్, శంకరప్ప, అస్మాసుల్తాన, ఆర్షియా బేగం, తేజస్విని, సక్కుబాయి తదితరులు ఉన్నారు.
ప్రముఖ సాహితీవేత్త మలుగ అంజయ్య

తెలుగు పద్యంతో సృజనాత్మకత