
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు టౌన్: తాండూరు పట్టణ శివారులోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల ప్రిన్సిపాల్ ప్రవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురుకులంలోని ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ బోధించుటకు, కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజి బోధించుటకు అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారాలను ఈనెల 30వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా గురుకులంలో అందజేయాలని కోరారు.
జాబ్‌మేళానుసద్వినియోగం చేసుకోవాలి
యాలాల: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్, మార్కెటింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్ యాలాల మండల అధ్యక్షుడు వీరేశం ముదిరాజ్ శుక్రవారం కోరారు. ఎమ్మె ల్యే మనోహర్‌రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌మేళా ఉంటుందన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సైన్స్‌పై ఆసక్తి కలిగేలా బోధన సాగాలి
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
పూడూరు: శాసీ్త్రయ దృక్ఫథాన్ని పెంపొందిస్తూ విద్యార్ధులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా బోధన చేయాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని ఎన్కేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఘన ప్రదార్థాలలో ధ్వని ప్రసరణ వేగవంతం జరుగుతుందనే ప్రయోగాన్ని వివరించారు. సెల్‌ఫోన్‌లో కాన్ఫరెన్స్ కాల్ ఎలా మాట్లాడుతున్నామనే దాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్ రవికుమార్ నాయక్, లాలయ్య, అకాడమిక్ మానిటరింగ్ అధికారి రామ్‌మస్తాన్, సెక్టోరియల్ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, రిసోర్సు పర్సన్లు రాందాస్, బాల్‌రాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధిని కట్టడి చేద్దాం
టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్
కొడంగల్ రూరల్: క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ కట్టడికి కృషి చేయాలని టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ సూచించారు. శుక్రవారం మండలంలోని రుద్రారం గ్రామ రైతు వేదికలో అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో టీబీ అనుమానితులతోపాటు, డయాలసిస్, షుగర్, బీపీ, హెచ్‌ఐవీ తదితర వ్యాధులకు సంబంధించి 120మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 41మందిని కొడంగల్ ఆస్పత్రికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు ఉన్నా, సాయంత్రం సమయంలో జ్వరం వచ్చినా, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచిచారు.
అవగాహన అవసరం
దోమ: టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన ఉండాలని జిల్లా టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్ అన్నారు. శుక్రవారం దోమ మండల కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా సీహెచ్‌ఓ విజయలక్ష్మి, పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్ అఖిల్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ ప్రభులింగం, డీపీఓ హైదర్ అలీ, ఎస్టీఎల్‌ఎస్ నవీన్‌గౌడ్, రాజు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం