రోడ్లపై కల్లాలు.. ప్రమాదాలకు నిలయాలు
దుద్యాల్: రోడ్లపైనే పంట ఉత్పత్తులను ఆరబోయడం, నూర్పిడి, రాసులు చేస్తుండటంతో వాహనాలు ప్రమాదాలకు గురువుతున్నాయి. గతంలో రైతులు గ్రామంలో కల్లాలు ఏర్పాటు చేసుకొని ధాన్యం, మక్కలు, వేరుశనగ తదితర పంటలను ఆరబెట్టేవారు. ప్రస్తుతం ప్రధాన రహదారుల పొడవునా పంట ఉత్పత్తులను ఆరబోస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ప్రాంతంలో నూర్పుడిలు చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నూర్పిడి తర్వాత వ్యర్థాలను రోడ్లపైనే వదిలేసి పోతున్నారు. దీంతో వ్యర్థాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళ ప్రయణం కష్టంగా ఉందని వాహనచోదకులు తెలిపారు. రోడ్లపై కల్లాలు ఏర్పాటు చేయకుండా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మండలంలోని నాజుఖాన్‌పల్లి, చిలుముల్ మైల్వార్, సాగారం తండా, గౌరారం, హంసంపల్లి, చెట్టుపల్లి తండా మార్గాల్లో కల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉందని పలువురు తెలిపారు.
రోడ్లపైనే ధాన్యం రాసులు
బొంరాస్‌పేట: వరి ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు రహదారులను కల్లాలుగా మార్చుకుంటున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని మెట్లకుంట నుంచి ఎన్కేపల్లి వరకు ధాన్యం నూర్పిడి కల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారులు అవగాహన కల్పించి రహదారులపై నూర్పిడి జరగకుండా చూడాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
రాత్రి వేళ ప్రయాణం మరింత ప్రమాదకరం
చర్యలు తీసుకోవాలంటున్న వాహనచోదకులు
అవగాహన కల్పించాలి
రోడ్లపై ధాన్యం ఆరబోయడం, కల్లాలు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. నూర్పిడి అనంతరం వ్యర్థాలను రోడ్లపైనే వదిలేసి వెళ్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చూడాలి.
– ఆశన్న, వాహనచోదకుడు. దుద్యాల్ మండలం
రోడ్లపై కల్లాలు.. ప్రమాదాలకు నిలయాలు
రోడ్లపై కల్లాలు.. ప్రమాదాలకు నిలయాలు


