ఇదీ దాసరి చరిత్రకు శ్రీకారం – నట్టి కుమార్‌ 

Natti Kumar about movie on Dasari Narayana Rao - Sakshi

‘‘సినీ పరిశ్రమ నిలబడటానికి దాసరి నారాయణరావు లాంటి పెద్దలు ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన సినీ ప్రయాణంతో ‘ఇదీ దాసరి చరిత్ర’ పేరుతో సినిమా తీస్తా. మే 4న దాసరిగారి జయంతిన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాత నట్టి కుమార్‌. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుకొచ్చి ప్రజల హృదయాల్లో  నిలిచిపోయారు. దాసరిగారు కూడా నిర్మాతల మండలిలోని సభ్యులకు మెడిక్లెయిమ్‌ పాలసీని వర్తింపజేశారు. అయితే కొందరు సినీ పెద్దలు వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి వచ్చారు.

రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సినీ రంగానికి దాసరిగారు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విగ్రహం పెట్టాలి.. అలాగే ఫిలింనగర్‌లో, ఆయన పుట్టిన పాలకొల్లులో దాసరిగారి పేరుతో పార్కులు నిర్మించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కృషిచేయాలి. ఏపీలో కూడా షూటింగ్‌లు జరగాల్సిన అవసరం ఉంది. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి, ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వైజర్‌ అలీ ఇండస్ట్రీలోని అందర్నీ కలుపుకుని ముందుకువెళ్లాలి. గిల్డ్‌లోని కొందరు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల గురించి ఆలోచించరు. అందుకే త్వరలో జరిగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వారిని ఎన్నుకోకుండా జాగ్రత్తపడాలి’’ అన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top