శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శన టికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి బయలుదేరి ఉదయం 3 గంటలకు శ్రీకాళహస్తి చేరుకున్నాం. ఉదయం ఆలయం వద్దకు వస్తే సిబ్బంది వాట్సాప్ విధానం ద్వారా మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని, లేకపోతే ఉచిత దర్శన క్యూలో వెళ్లాలని సూచించారు. దీంతో తిరిగి గదికి వెళ్లి ఫోన్ తీసుకొచ్చి టికెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. దర్శన టికెట్ల జారీ విధానంపై స్పష్టమైన సమాచారం, ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలి.
– పద్మావతి, విశాఖపట్నం


