శ్రీకాళహస్తి ఆలయంలో అమలు చేస్తున్న ఆన్‌లైన్ టికెట్ విధానం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేం రాజమండ్రి నుంచి ప్రయాణించి ఆలయానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శన టికెట్లు పొందడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. అందరికీ ఆన్‌లైన్ విధానంపై అవగాహన ఉంటుందని ఎలా అనుకుంటారు? ఆన్‌లైన్ విధానాన్ని కొనసాగించినా, భక్తుల సౌకర్యార్థం నగదు చెల్లించి నేరుగా టికెట్లు పొందే పాత విధానాన్ని కూడా కొనసాగించాలి. – సత్యనారాయణ, రాజమండ్రి


