అర్ధరాత్రిలో తెలుగు తమ్ముళ్ల వీరంగం | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రిలో తెలుగు తమ్ముళ్ల వీరంగం

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

● రాజువారిపల్లె ఘటన ● భయాందోళనలో ప్రజలు

భాకరాపేట:చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలంలో కొందరు టీడీపీకి చెందిన యువకులు పుట్టిన రోజు వేడుకల పేరుతో నానా హంగామా సృషించారు. రాత్రి వేళ పిల్లలు భయపడుతారని చెప్పినందుకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బాధితులు శారద అనే మహిళ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి చిన్నగొట్టిగల్లు పంచాయతీ పరిధిలోని రాజువారిపల్లెలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇంటి ముందు కొందరు టీడీపీకి చెందిన యువకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేకలు వేస్తూ టపాకాయలు పేలుస్తూ నానా హంగామా చేశారు. శారద అనే మహిళ మరికొందరు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ యువకులు ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. బండ రాళ్లతో కొట్టి భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటనలో శారద, జానకీరామ్‌, ఎర్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధితులు భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement