డీఎస్సీ మోసాలపై సీబీఐతో విచారణ చేయించాలి. రాష్ట్రంలో 13 లక్షల మంది పరీక్షలు రాస్తే అందులో 16,465 మందికి మెరిట్‌లో వచ్చారన్నారు. వారి వివరాలు ప్రకటించాలి. అలాగే క్రీడా కోటాలో 421 పోస్టులను మార్కెట్‌లో సరుకుల్లా అమ్ముకున్నారు. నిరుద్యోగులను నట్టేట ముంచారు.
– హేమంత్‌రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, యువత విభాగం
లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీ పరీక్ష పేపర్ లీకై ంది. దీని వెనుక కూటమి నాయకులు ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. లీక్ వ్యవహరంతోనే అవుట్‌స్సోరింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ అయ్యారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.
– మనోజ్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు


