తోపుడు బండ్లతో వచ్చిన
భూమన అభినయ్
అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసు బలగాలు
వెనకడుగు వేయకుండా దూసుకొచ్చిన పార్టీ నేతలు
భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ శ్రేణుల అరెస్టు
అలిపిరి వద్దకు భూమన అభినయ్ రెడ్డి, బాధితులైన చిరు వ్యాపారులను రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అలిపిరి మార్గంలో ఉదయం ఏడు గంటలకే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, పార్టీ శ్రేణులు రాకపోకలపై తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, వంద మందికి పైగా పోలీసులు అలిపిరి ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ కొంతమంది కానిస్టేబుళ్లు ఫ్లెక్సీలను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.
తిరుపతి తుడా: అలిపిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బలగాలు మోహరించడంతో ఆందోళన నెలకొంది. పోలీసు చెక్ పాయింట్లు, తనిఖీలతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందంటూ హడావుడి. ఇందుకు సంబంధించిన బ్యానర్లతో పోలీసులు కనిపించడం ఆశ్చ ర్యం కలిగించింది. అయినా అనుకున్న విధంగా వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి బాధితులైన చిరు వ్యాపారు లతో కలిసి అలిపిరి సమీపంలోకి చేరుకున్నారు. ఈ క్రమంలో తోపుడు బండ్లతో వస్తున్న అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ముందుకు చొచు కుని వచ్చే క్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరు కుని రోప్‌ల సాయంతో నిలువరించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, మహిళా కార్యకర్తలు అడ్డుపడడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో పార్టీ నేతలకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. అరగంట పాటు అలిపిరి ప్రాంతంలో వాహనాలు స్తంభించిపోయాయి. బాధితులకు న్యాయం చేయాలని పార్టీ శ్రేణులు గర్జించడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలగించిన చోటే స్టాళ్లను ఏర్పాటు చేయాల్సిందేనంటూ భూమన అభినయ్ డిమాండ్ చేయడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అడ్డొచ్చిన కార్యకర్తలు, పలువురు నేతలను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వాహనాల్లో పడేసి అరెస్టు చేశారు.
అలిపిరిలో ఉద్రిక్తత
పలువురి అరెస్టు
చిరు వ్యాపారులకు అండగా నిలిచిన భూమన అభినయ్ రెడ్డితోపాటు పదుల సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్టేషన్‌కు తర లించారు. మల్లం రవిచంద్రారెడ్డితో పాటు వివిధ విభాగాల అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నేతలు, మహిళా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి, ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


