శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి మండలంలోని బొక్కిసంపాళెం పంచాయతీ జాతీయ స్థాయి మహిళా స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికై ంది. దీంతో ఆ పంచాయతీ అభివృద్ధికి రూ. కోటి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో అవార్డు ప్రదానం చేశారు. పంచాయతీ ఎంపికకు కృషి చేసిన తిరుపతి జిల్లా డీపీఓ సుశీలాదేవి, డిప్యూటీ ఎంపీడీఓ పద్మజ, పంచాయతీ కార్యదర్శి విజయ్, పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజకు జాతీయ స్థాయిలో అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా డీపీఓ సుశీలాదేవి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి విజయ్‌ను ఆమె అభినందించారు.


