బీఎల్‌ఏలు సైనికుల్లా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు సైనికుల్లా పనిచేయాలి

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నాయుడుపేట టౌన్‌: ‘వైఎస్సార్‌ సీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (ఎస్‌ఐఆర్‌) స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ విధానంపై సైనికుల్లా పని చేయాలి. దొంగ ఓట్ల చేర్పులపై ప్రత్యేక నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండేలా చూడాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడితే నికచ్చిగా అడ్డుకోవాలి. మోసగాడు, మాయల మరాఠీ అయిన చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి.’ అని మాజీ మంత్రి, ఉమ్మడి ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాయుడుపేటలోని డీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో మంగళవారం వైఎస్సార్‌ సీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంపై పార్టీకి చెందిన బీఎల్‌ఏలతోపాటు నాయకులందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ విధానంతో చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలనకు క్షుణంగా పరిశీలించాన్నారు. ఈ విధానంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించడంతో లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మాయల మరాఠీ అని, ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తూ తిమ్మిని బమ్మిని చేసేలా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల చేర్పులు తదితర అక్రమాలకు పాల్పడితే వెంటనే గుర్తించి వాటిని అడ్డుకోవాలన్నారు. గతంలో చంద్రబాబు కుప్పం నియోజవర్గంలో తమిళనాడుకు చెందిన 35 వేల దొంగ ఓట్లు చేర్పించారని, ప్రతిసారి ఎన్నికల్లో దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తుండడాన్ని అడ్డుకోవాలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.

ఓటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపండి

ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి ఒక్కరు ఓటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో సంబంధిత వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలు వారి పరిధిలోని జాబితాలను క్షుణంగా పరిశీలించి, తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు పార్టీకి వెన్నుముఖలా పనిచేయాలని ఎంపీ సూచించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ బీఎల్‌ఏలు దొంగ ఓట్లు నమోదు కాకుండా, చనిపోయిన వారి ఓట్లు తొలగించేలా చూడాలన్నారు. బీఎల్‌ఏలు అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. దీనిపై ఎలాంటి అనుమానాలున్నా, తనకుగానీ పార్టీకి కేటాయించిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అనంతరం ఆరు మండలాలకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు టాస్క్‌ఫోర్స్‌ అధికారిగా వచ్చిన మహేష్‌ పవర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బీఎల్‌ఏలు చేపట్టాల్సిన పలు అంశాలపై క్షుణంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, ఎన్‌డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, వేణుంబాక మునస్వామి నాయుడు, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జునరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కటకం దీపిక, ఎంపీపీలు ధనలక్ష్మి, అనీల్‌రెడ్డి, అరుణారెడ్డి, శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు ఒట్టూరు కిషోర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement