తిరుపతి మంగళం : ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో వంచన, మోసం, కపటం, ద్రోహం, వెన్నుపోటు పెట్టుబడిగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసం వద్ద ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను ఎ మ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు పార్టీ శ్రేణులతో కలిసి ఆయ న ఆవిష్కరించారు. అనంతరం భూమన మాట్లాడు తూ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో ప్రజలను వంచించి, మోసిగించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చి నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన పాపాన పోలేదని, కాబట్టే నోటికి వచ్చినట్లుగా ఏకంగా 143 హామీలను గుప్పించి అందులో ప్రధానంగా సూపర్‌సిక్స్ అమలు చేస్తానంటూ సూపర్‌గా మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఎంతకాలం ప్రజలను మోసగించి, వెన్నుపోటు పొడిచి అధికారం ఏలుతావ్? చంద్రబాబు అని ప్రశ్నించారు. ప్రజలకు మోసాలతో కూడిన హామీలను గుప్పించి, వంచించి, వెన్నుపోటు పొడిచి రెండేళ్లు అవుతోందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ నుంచి మండల స్థాయి నుంచి 12వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేసిన ద్రోహా న్ని ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. పార్టీ నాయకులు రామస్వామి వెంకటేశ్వర్లు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, లవ్లీ వెంకటేష్, ఆరే.అజయ్‌కుమార్, నల్లానిబాబు, వాసుయాదవ్, ఉదయ్‌వంశీ, మల్లం రవికుమార్‌రెడ్డి, బత్తల గీతాయాదవ్, గోపాల్‌రెడ్డి, కల్లూరి చెంగయ్య, అనీల్‌రెడ్డి, తులసి పాల్గొన్నారు.


