వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ఈనెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మంగళవారం వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి సమీక్షించారు. నిరసన కార్యక్రమాలు విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకున్నారు.
టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య) డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్వీబీసీ కార్యాలయం నుంచి టీటీడీ డీఈఓ వెంకట సునీల్‌తో కలిసి కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.


