తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రీపెయిడ్ విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో 4,735 సర్వీసులకు రూ.1.19 కోట్లు, తిరుపతి జిల్లాలో 4,942 సర్వీసులకు రూ.2.29 కోట్లు, చిత్తూరు జిల్లాలో 4,193 సర్వీసులకు రూ.1.63 కోట్లు, అన్నమయ్య జిల్లాలో 4,324 సర్వీసులకు రూ.1.68 కోట్లు, కడప జిల్లాలో 4,520 సర్వీసులకు రూ.1.98 కోట్లు, అనంతపురం జిల్లాలో 2,829 సర్వీసులకు రూ.1.41 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,432 సర్వీసులకు రూ. 88.81 లక్షలు, కర్నూలు జిల్లాలో 3,243 సర్వీసులకు రూ.1.63 కోట్లు, నంద్యాల జిల్లాలో 3,278 సర్వీసులకు రూ.1.54 కోట్లతో సంస్థ రీచార్జ్ చేసింది.


