అగ్నిగుండ మహోత్సవానికి వచ్చి.. | - | Sakshi
Sakshi News home page

అగ్నిగుండ మహోత్సవానికి వచ్చి..

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

– రోడ్డు దాటుతూ వృద్ధుడి దుర్మరణం

ఏర్పేడు: తిరుపతి–శ్రీకాళహస్తి మార్గం ఏర్పేడు మండలం, అంజిమేడు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. ఏర్పేడు ఎస్‌ఐ రవిప్రకాష్‌ తెలిపిన వివరాలు.. ఏర్పేడు మండలం, పాగాలి పంచాయతీ, క్రిష్ణంపల్లికి చెందిన మాణికుప్పం మునిరత్నంరెడ్డి(65) ఆదివారం పాతవీరాపురంలో జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చాడు. బంధువుల ఇంట్లో భోజనం చేసి స్వగ్రామానికి తిరుగుపయనమయ్యాడు. అంజిమేడుకు చేరుకుని అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్లాలన్న ఆలోచనతో పాతవీరాపురం నుంచి నడుచుకుంటూ అంజిమేడు సమీపంలోని ఓ హోటల్‌ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు బలమైన రక్తగాయం కావడతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, కుమారులు ముద్దుకృష్ణారెడ్డి, వెంకటమునిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, కుమార్తె జానకి ఉన్నారు. చిన్న కుమారుడు ఈశ్వర్‌రెడ్డికి మినహా మిగిలిన వారందరికి వివాహాలయ్యాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement