తొట్టంబేడులో విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

తొట్టంబేడులో విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

– అర్ధ ఎకరా వరి పంటకు నష్టం

తొట్టంబేడు: తొట్టంబేడు మండలంలో విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతుకు శాపంగా మారింది. వివరాలు.. తొట్టంబేడు మండలం, శేషమనాయుడుకండ్రిగ గ్రామానికి చెందిన ఓ రైతు 12 ఎకరాల వరకు వరి పైరు నాటాడు. అయితే విద్యుత్‌ అధికారులు నూతనంగా 11 కేవీ త్రీ ఫేజ్‌ విద్యుత్‌ వైర్లు లాగేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ రైతుకు చెందిన సుమారు అర్ధ ఎకరా వరి పైరు దెబ్బతింది. రూ.20 వేల వరకు నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement