భారీ కోతలకు సిద్ధమైన బాబు ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

భారీ కోతలకు సిద్ధమైన బాబు ప్రభుత్వం

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

● తల్లికి వందనంపై స్పష్టత ఇవ్వని యంత్రాంగం ● అర్హులందరికీ లబ్ధి చేకూరడంపై సందేహం ● పలు నిబంధనలు తీసుకువస్తున్నట్టు ప్రచారం ● తప్పుల సవరణకు చర్యలు శూన్యం

● తల్లికి వందనంపై స్పష్టత ఇవ్వని యంత్రాంగం ● అర్హులందరికీ లబ్ధి చేకూరడంపై సందేహం ● పలు నిబంధనలు తీసుకువస్తున్నట్టు ప్రచారం ● తప్పుల సవరణకు చర్యలు శూన్యం

తిరుపతి అర్బన్‌ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం సీఎం చంద్రబాబుకు ఆది నుంచీ అలవాటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ కారణాలతో వేలాది మంది తల్లులకు నిరాశనే మిగిల్చారు. అక్కడితో ఆగకుండా అర్హులందరికీ ఇస్తామంటూ ఆశపెట్టి ఎందరో తల్లులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. అయితే నగదు జమ చేయకుండా వారిని మానసిక క్షోభకు గురిచేశారు. మళ్లీ ఇప్పుడు 2026–27 విద్యాసంవత్సరానికి అదే బాటలో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేందుకు నూతన నిబంధనలు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల హామీ ఇలా..

‘‘ నా ఆడబిడ్డల కోసం నేను హామీ ఇస్తున్నా...తల్లికి వందనం పథకాన్ని కచ్చితంగా అమలు చేస్తా..ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏటా రూ.15వేల చొప్పున అందిస్తా’’ అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక ఒక్కో బిడ్డకు రూ.13వేలు మాత్రమే ఇస్తామంటూ నాలుక మడతపెట్టేశారు.

విద్యార్థులకు అకౌంట్‌ అవసరమా..?

తల్లికి వందనం పథకం పొందడానికి విద్యార్థులకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. కొందరు సచివాలయ ఉద్యోగులు సరైన అవగాహన లేకపోవడంతో తల్లులతోపాటు విద్యార్థులకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలని...ఆ మేరకు ఖాతాలు ఓపెన్‌ చేసుకోవాలని సలహాలు ఇచ్చేస్తున్నారు. ఈ అంశంపై విద్యాశాఖాధికారులు స్పష్టత ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోత పెట్టడమే లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 2,79,377 మంది, ఇంటర్‌లో మరో 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా 3,39,377 మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తించాల్సి ఉంది. అయితే ఆధార్‌కు బ్యాంక్‌ లింకేజీ, రేషన్‌కార్డుల్లో తప్పులు, ఈకేవైసీ, బయోమెట్రిక్‌ తదితర 47 కారణాలు చూపించడంతోపాటు 75 శాతం హజరు లేదంటూ మరో 20శాతం మందికి ఎగనామం పెట్టారు. దీంతో అవాకై ్కన తల్లులు రేషన్‌, ఆధార్‌కార్డులతోపాటు స్కూల్‌ సర్టిఫికెట్లలోని పొరబాట్లను సవరించుకున్నప్పటికీ రెండో దశ, మూడో దశ అంటూ తిప్పించుకుని ముఖం చాటేశారు.

Advertisement
 
Advertisement
Advertisement