– 8లో
జనమే ప్రధానం.. జైలుకు భయపడం
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటాం.. జనం కోసం వందసార్లు జైలుకు వెళతామని మోహిత్‌రెడ్డి తెలిపారు.
వివిధ కారణాలతో పేద కుటుంబాలవారు సైతం తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. చిన్న చిన్న తప్పులకు అనర్హుల కింద పరిగణించారని వాపోతున్నారు. అయితే ఈ ఏడాదైనా వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లికి వందనం పథకంపై జోరుగా కసరత్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పలువురు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు పన్నాగాలు పన్నుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.


