ప్రమాదకరం.. పొగాకు వాడకం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరం.. పొగాకు వాడకం

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

తిరుపతి తుడా : పొగాకు వాడకం ప్రమాదకరమని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్‌ తెలిపారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. డీఎంహెచ్‌ ఓ మాట్లాడుతూ పొగాకు వినియోగంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రూప్‌కుమార్‌ , డీపీఎమ్‌ఓ డాక్టర్‌ చత్ర ప్రకాష్‌ రెడ్డి, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ నాగేంద్ర కుమార్‌, డిప్యూటీ డెమో బలరామరాజు పాల్గొన్నారు

స్విమ్‌ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో..

స్విమ్స్‌ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం పద్మావతి ఓపీడీ బ్లాక్‌లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీ కుమార్‌, మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ అల్లాడి మోహన్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement