ఉపాధిలో అవినీతిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో అవినీతిపై విచారణ

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

కలువాయి(సైదాపురం) : కలువాయి మండలం వెంకటరామరాజుపేటలో చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో అవినీతిపై శనివారం ఆత్మకూరు క్లస్టర్‌ ఏపీడీ శంకర్‌నారాయణ విచారణ చేపట్టారు. బినామీ మస్టర్లు, హార్టికల్చర్‌, ఫెరికల్చర్‌లో అక్రమాలపై సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన ‘అవినీతి ఉపాధి’ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు విచారణ పూర్తి చేసి నివేదికను పీడీకి అందించినట్లు ఏపీడీ శంకర్‌నారాయణ వెల్లడించారు.

6 నుంచి ఇంటర్‌ తరగతులు

తిరుపతి సిటీ : జిల్లాలోని ఇంటర్మీడియట్‌ కళాశాలలు జూన్‌ 6వ తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 5వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నందున, 1 నుంచి ప్రారంభం కావాల్సిన తరగతులను 6వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement