అక్షరాస్యులుగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

అక్షరాస్యులుగా తీర్చిదిద్దుదాం

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

తిరుపతి అర్బన్‌: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని డీఆర్వో నరసింహులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో అక్షర ఆంధ్ర ఉల్లాస్‌ కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్‌ 30 వరకు నిరక్ష్యరాసులను వలంటీర్లుగా గుర్తించి అక్షర ఆంధ్ర యాప్‌లో వారి పేర్లు నమోదు చేయాలన్నారు. జూలైలో తరగతులు ప్రారంభించి 2027 మార్చి వరకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. వయోజన విద్య నోడల్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement