బెంగాల్‌ రాష్ట్ర పరిస్థితి రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ రాష్ట్ర పరిస్థితి రానీయొద్దు

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కూటమి కుట్రలు ఓటరు సవరణలో బీఎల్‌ఏలు కీలకపాత్ర పోషించాలి విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్ధేశం చేసిన నేతలు

తిరుపతి మంగళం : ‘సర్‌’ ఓటరు సవరణతో మొన్నటి రోజున బెంగాల్‌ రాష్ట్రంలో ఓట్లు తొలగించి ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. అదే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, క్లస్టర్‌ ఇన్‌చార్జులు, బీఎల్‌ఏలు జాగ్రత పడాలి’ అని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్‌ ఓటరు సవరణపై బీఎల్‌ఏలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వచారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సర్‌ ఓటరు సవరణ పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే కాకుండా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చేందుకు చంద్రబాబు, లోకేష్‌ కుట్రలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40వేల ఓట్లను బీజేపీ తొలగించిందని ఆరోపించారు. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అదే కుట్రలు పన్నేందుకు తీవ్ర పయత్నాలు చేస్తోందన్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, బీఎల్‌ఏలు ప్రతి ఇంటికీ వెళ్లి 2002 నుంచి 2025 వరకు సంబంధించిన ఓటర్లు ఉన్నారా? అన్న విషయాలకు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.

బీఎల్‌ఏల చేతిలోనే వైఎస్సార్‌సీపీ గెలుపు

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు బీఎల్‌ఏల చేతిలోనే ఉందన్నారు. సర్‌ ఓటరు సవరణలో బీఎల్‌ఏలు కీలకపాత్ర పోషించాలన్నారు. జగనన్న గెలుపు బీఎల్‌ఏల చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఓటరు సవరణలో కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా వాటిని తిప్పికొట్టేలా పనిచేయాలని కోరారు. అనంతరం సర్‌ ఓటరు సవరణపై బీఎల్‌ఏలు చేయాల్సిన అంశాలను డిజిటల్‌ స్క్రీన్‌పై ఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడి వివరించారు. ఇప్పటికి పది సార్లు సర్‌ ఓటరు సవరణ చేశారని, ప్రస్తుతం 2002 నుంచి 2025వరకు గత 20 ఏళ్ల తరువాత తిరిగి సర్‌ ఓటరు సవరణ చేస్తున్నారన్నారు. ఇందులో మన పార్టీ బీఎల్‌ఏలు ఎంతో కీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. తిరుపతి కో–ఆపరేటీవ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కేతం జయచంద్రారెడ్డి, ఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ అధ్యక్షురాలు సాయికుమారి, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు బృంగీ నవీన్‌, షేక్‌ ఇమ్రాన్‌ బాషా, తమ్ముడు గణేష్‌, పడమటి కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement