ప్రతి ఏజెంట్‌ అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఏజెంట్‌ అప్రమత్తంగా ఉండాలి

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

రైల్వేకోడూరు అర్బన్‌: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ సర్‌ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రాజ్‌ కల్యాణ మండపంలో జరిగిన సర్‌ ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్‌బాబు, కొండూరు అజయ్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతంగా ఉందని, వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబు ఎలాంటి కుట్రలకైనా పాల్పడవచ్చని తెలిపారు. సర్‌ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్లు తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏలు దృష్టి పెట్టాలన్నారు. కొని పార్టీలకు అనుకూలంగా తొలగింపులు చేపడితే చట్ట రీత్యా పోరాడాలని తెలిపారు. కార్యకర్తలు సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. నియోజకవర్గంలో 2.15 లక్షల ఓట్లు ఉన్నాయనిన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే నియోజకవర్గ నాయకత్వాన్ని సంప్రదించాలని తెలిపారు. జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్‌రెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, చెవు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, రాయలసీమ బూత్‌కన్వీనర్‌ తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తిప్పన నాగభుషణం, వెంకటరెడ్డి, సీహెచ్‌ రమేష్‌, మందల నాగేంద్ర, నందాబాల, విజయ్‌కుమార్‌రెడ్డి, లింగంలక్ష్మీకర్‌, సుదర్శన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement