తొండవాడలో పర్యటన | - | Sakshi
Sakshi News home page

తొండవాడలో పర్యటన

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

చంద్రగిరి: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ బీఎల్‌సీ హౌసింగ్‌ పథకం కేంద్ర బృందం శుక్రవారం మండల పరిధిలోని తొండవాడలో శుక్రవారం పర్యటించింది. పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని గృహ అవసరాలను తీర్చడం, పీఎంఏవై పథకాన్ని మూల్యాంకనం చేయడానికి, పీఎంఏవై అర్బన్‌ బీఎల్‌సీ పథకాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు ప్రొఫెసర్‌ సుమనాగుప్తాప్త, దేబో స్మితగోష్‌, భిక్రమ్‌ ఖాన్‌లతో కూడిన ప్రత్యేక బృందం జగనన్న కాలనీని సందర్శించింది. అందులో భాగంగా పీఎంఏవై హౌసింగ్‌ పథకం ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లేఅవుట్‌లలో ఉన్న లబ్ధిదారులతో సమావేశమై వివరాలను సేకరించారు. సేకరించిన వివరాలను సంబంధించిన నివేదికను భారత ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ హోసింగ్‌ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను చూసి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా హౌసింగ్‌ పీడీ గోపాల్‌నాయక్‌, ఈఈ శ్రీరాములురెడ్డి, శేషగిరి, డీఈఈ రమణయ్య, పీఎంఏవై హౌసింగ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కాటమరాజు, మహమ్మద్‌ అనీఫ్‌, సరస్వతి, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement