చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా విద్యార్థులను దగా చేస్తోందన్నారు. డీఎస్సీ పోస్టులను మార్కెట్‌లో కూరగాయల్లా అమ్మేశారని ఆరోపించారుఅన్ని శాఖల్లో నారా లోకేష్ తలదూర్చి డబ్బులు దండు కోవడంపై శ్రద్ధ చూపిస్తూ పేద విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పరిపాలన చేతగాని లోకేష్‌ను మంత్రి పదవి నుంచి గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో విద్యార్థి విభాగం నేతలు ఓబుల్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, తిరుపతి నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు స్వరూప్, వర్సిటీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్, చెంగల్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, వినోద్, రఫీ, శేషారెడ్డి, నక్కా హరినాథ్‌తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు.


