సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో రిటైర్డ్ కానున్న పలువురు అధికారులకు మళ్లీ అదే కీలక స్థానాల్లో ఎక్స్‌టెన్షన్ కల్పించే విషయంపై శుక్రవారం ‘సాక్షి’లో ‘గోవిందా ఇదేమైనా బాగుందా’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ప్రస్తుతానికి ఆయా డివిజన్లలో ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ఇంజినీరింగ్ అధికారుల ఎక్సెటెన్షన్ నియామకాలను నిలుపుదల చేసినట్లు తెలిసింది. కాగా ఆ స్థానాలకు ఆదే డివిజన్‌లోని సీనియర్లకు ఇన్‌చార్జిగా నియమించేందుకు ఫైల్ సిద్ధం చేశారని సమాచారం.


