స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేద్దాం

May 30 2026 12:11 AM | Updated on May 30 2026 12:11 AM

తిరుపతి అర్బన్‌: స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సహకరించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన డీఆర్వో నరసింహులుతో కలసి రాజకీయ పార్టీ నేతలతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ జూన్‌ 5 నుంచి మొదలు పెట్టనున్నట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం, మరణించిన లేదా వేరే ప్రాంతాలకు తరలిపోయిన వారి పేర్లను తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

మీడియా సహకరించాలి

సర్‌పై ఓటర్లకు అవగాహన పెంచడానికి మీడియా సైతం పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. జూన్‌ 5 నుంచి 14వ తేదీ వరకు బీఎల్వోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలకు శిక్షణ ఉంటుందన్నారు. అనంతరం జూన్‌ 15 నుంటి జూలై 14వ తేదీ వరకు ఇంటింటికి బీఎల్వోలు వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని వెల్లడించారు. జూలై 14లోపు పోలింగ్‌ స్టేషనన్‌ తుది జాబితా పూర్తి చేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement