తొండవాడలో పర్యటన | - | Sakshi
Sakshi News home page

తొండవాడలో పర్యటన

May 30 2026 12:11 AM | Updated on May 30 2026 12:11 AM

– 8లో

కేంద్ర బృందం తొండవాడలోని జగనన్న కాలనీని పరిశీలించింది. వసతులపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేసింది.
ఆదాయ వనరుగా డీఎస్సీ

అనంతరం భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీపై తొలి సంతకం పెట్టినా ఆ ప్రక్రియను ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. మహానాడులో వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం కంటే డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇప్పటికే ఉన్న స్పోర్ట్స్‌ కోటాను కాదని అదనపు క్రీడలను అందులో చేర్చి అర్హత లేని వారికి పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు. డీఎస్సీ కోసం 3.5 లక్షల మంది పరీక్షలు రాసినా తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసుకునేలా మొత్తం ప్రక్రియ నడిపించారని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను బయటపెట్టే బాధ్యతను తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగానికి అప్పగించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement