కారు ఓవర్‌ స్పీడ్‌ దెబ్బకి..! | - | Sakshi
Sakshi News home page

కారు ఓవర్‌ స్పీడ్‌ దెబ్బకి..!

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

చంద్రగిరి: మితిమీరిన వేగంతో వెళ్తూ కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఆపై పొలాల్లోకి దూసుకుపోయింది. కారు ఢీకొన్న దెబ్బకు విద్యుత్‌ స్తంభం విరిగిపోవడంతో రెండు గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. గురువారం ఈ సంఘటన చిన్నరామాపురం నుంచి భీమవరానికి వెళ్లే మార్గంలోని మూలపల్లె వద్ద చోటుచేసుకుంది. అయితే ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును అక్కడే వదిలేసి, మరో వాహనంలో అక్కడి నుంచి ఉడాయించారని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొన్న సమయంలో అది కారుపై పడి ఉండి పెను ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

రోడ్డుకు అడ్డంగా

కంటైనర్‌ వాహనం

– గంట పాటు శ్రమించిన పోలీసులు

సూళ్లూరుపేట రూరల్‌: సూళ్లూరుపేటలోని మన్నారుపోలూరు కోనేరు సమీపం వద్ద 16 చక్రల కంటైనర్‌ వాహనం మలుపు తిరిగే సమయంలో పక్కనే ఉన్న నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్‌లో తిగబడింది. లారీ రోడ్డుకు అడ్డంగా తిరిగి ఆగిపోయింది. రోడ్డుకు రెండు వైపుల భారీ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. గంట పాటు వాహనాలు నిలబడిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ తన సిబ్బందితో వెళ్లి జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి డ్రైనేజీలో ఇరుక్కున్న లారీని బయటకు తీశారు. ఆపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement