డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ అంబులెన్స్‌

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

– ఆరుగురికి స్వల్పగాయాలు

నాయుడుపేట టౌన్‌: నాయుడుపేట పట్టణ పరిధిలోని 71వ జాతీయ రహదారిపై గురువారం మృతదేహాన్ని తరలిస్తున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ సాయితో పాటు క్లీనర్‌ కోదానవాసి సాయి గాయపడ్డారు. అదేవిధంగా మృతదేహాన్ని తరలించుకుపోతున్న మరో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. తిరుపతి నుంచి విజయనగరానికి మృతదేహాన్ని ప్రైవేట్‌ అంబులెన్స్‌లో తరలించుకుపోతున్నారు. మార్గమధ్యం నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అంబులెన్స్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. డ్రైవర్‌ సాయితో పాటు క్లీనర్‌, అంబులెన్స్‌లో ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివశంకర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించారు. అంబులెన్స్‌లోని మృతదేహాన్ని మరో అంబులెన్స్‌లో విజయనగరానికి తరలించుకు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement