అంబా..దాహం | - | Sakshi
Sakshi News home page

అంబా..దాహం

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

ఎండలు మండిపోతున్నాయి. గుక్కెడు నీటి కోసం అనేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. కాలువలు, చెరువుల్లో చెమ్మలేకపోవడంతో గొంతు తడుపుకోవడానికి తహతహలాడుతున్నాయి. ఎక్కడ నీరు దొరికితే అక్కడ సేదతీరిపోతున్నాయి. తనివితీరా నీళ్లు తాగి ఉపశమనం పొందుతున్నాయి. ఇలాంటిదే శ్రీకాళహస్తి మండలం, తొండమనాడు ప్రాంతంలో గురువారం కనిపించింది. ఓ ఆవు నీటి కోసం పోరాడుతూ.. తీరా ఓ బోరు మోటారు వద్ద నీళ్లు రావడాన్ని గమనించి అక్కడికి పరుగులు తీసింది. ఆపై తనివితీరా నీళ్లు తాగి సేదతీరడం కనిపిచింది.

– సాక్షి, తిరుపతి ఫొటో గ్రాఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement