ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

● జేసీబీతో చదును ● స్థానికుల ఫిర్యాదుతో అడ్డుకున్న రెవెన్యూ అధికారులు ● గర్భం దాల్చిన బాధితురాలు ● నిందితుడిపై పోక్సో కేసు ● రిమాండ్‌కు తరలింపు

● జేసీబీతో చదును ● స్థానికుల ఫిర్యాదుతో అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

ఏర్పేడు: మండలంలోని రావిళ్లవారి కండ్రిగలో విలువైన ప్రభుత్వ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత రూ.4 కోట్ల విలువైన 4.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో బుధవారం జేసీబీ పెట్టి చదును చేయడం ప్రారంభించాడు. స్థానికులు తహసీల్దార్‌ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అక్కడకు చేరుకుని జేసీబీని అడ్డుకున్నారు. వివరాలు.. మండలంలోని పెనుమల్లం రెవెన్యూ, రావిళ్లవారికండ్రిగ గ్రామ పరిధిలో సర్వే నం.197/1లో 4.05 ఎకరాల అనాధీనం భూమి ఉంది. ఈ భూమి విలువ మార్కెట్లో రూ.4కోట్లకు పైగా ఉంటుంది. ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్నేశాడు. అధికార పార్టీ అండదండలు చూసుకుని ఎటువంటి అనుమతులు లేకుండా బుధవారం ఉదయం జేసీబీ పెట్టి చదును చేయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్‌ వీఆర్వో హరిని ఘటనా స్థలానికి పంపించి చదును చేసే పనులను అడ్డుకున్నారు. అయితే స్థానిక వీఆర్‌వో ఆక్రమణదారునికి వంతపాడుతున్నట్లు స్థానికులు అతనిపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ భూమిపై కోర్టులో కేసు వేయగా, ప్రభుత్వ భూమిగా తేల్చడంతో అప్పట్లో ఇక్కడ స్థానికులకు ఇంటి స్థలాలను మంజూరు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం మారడంతో విలువైన ఆ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆక్రమణదారుడిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మేకల కాపరి బాలికపై అఘాయిత్యం

వరదయ్యపాళెం: మండలంలోని రాచకండ్రిగలో మానవత్వానికే మాయనిమచ్చలాంటి ఘటన వెలుగుచూసింది. పొట్టకూటి కోసం మేకలు మేపుకుంటున్న 16 ఏళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 46 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డాడు. నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాతరి వెంకటరమణయ్య (46) కూడా మేకల మందతో అడవికి వెళ్తుండేవాడు. అదే ఊరికి చెందిన బాలిక మేకలు మేపుకునేందుకు వచ్చి ఒంటరిగా దొరకడంతో మాయమాటలు చెప్పి, బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సోమవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. విషయం తెలుసుకున్న శ్రీసిటీ పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు బీఎన్‌ఎస్‌ 64 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ బీవీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రియాంక సిబ్బందితో స్వయంగా దర్యాప్తు చేపట్టి, నిందితుడిని మంగళవారం అరెస్ట్‌ చేశారు. బుధవారం సత్యవేడు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. బాధిత బాలికను శ్రీసిటీ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ద్వారా కౌన్సెలింగ్‌, పునరావాసం కల్పిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement