నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టేశాడు! | - | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టేశాడు!

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

● నెల క్రితం జరిగిన ఘటన ● ఛేదించిన పోలీసులు ● నిందితుడికి రిమాండ్‌

దొరవారిసత్రం: దొరవారి సత్రం మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. ఆమె కుమారుడే పెట్రోలు పోసి నిప్పంటించి చంపేశాడని తేల్చారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ సంఘమేశ్వరరావు, స్థానిక ఎస్‌ఐ జీవీ చౌదరి దొరవారిసత్రం పోలీస్‌ స్టేషన్‌ వద్ద బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని చందనముడి గ్రామ పరిధి, ఎస్సీ కాలనీకి చెందిన అంబూరు సుజాత (37) గత నెల 25న అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు అప్పట్లో కేసు నమోదు చేశారు.

తల్లిపై పెట్రోల్‌ పోసి!

సుజాతకు, ఆమె పెద్ద కుమారుడు సుధీర్‌కు మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తల్లిపై కక్ష పెంచుకున్న సుధీర్‌ గత నెల 25వ తేదీన రెండు లీటర్ల పెట్రోల్‌ కొనుగోలు చేసి అర్ధరాత్రి సమయంలో మేడపై నిద్రసిస్తున్న తల్లిపై పోసి నిప్పటించాడు. ఆపై ఏమీ తెలియనట్లు కిందకు వచ్చేశాడు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో సుజాత కేకలు వేసింది. పక్కనే నిద్రిస్తున్న రెండో కుమారుడు విష్ణు నిద్రలేచి అరవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలార్పారు. అప్పటికే శరీరం అంతా కాలి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది.

పొంతన లేని సమాధానాలతో..

తల్లి మృతి విషయంలో పెద్ద కుమారుడు అన్ని ఆధారాలు దాచి పెట్టడడంతో పాటు ప్రమాదం జరిగినట్లు చిత్రికరించాడు. అదేవిధంగా తల్లిని చికిత్స కోసం తరలించిన దగ్గర అంతా పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానిస్తూ వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే క్లూస్‌ టీమ్‌ సేకరించిన ఆధారులను బట్టి సుజాతది హత్యగా పరిగణనలోకి తీసుకున్నారు. చివరిగా సుఽఽధీర్‌ను విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు సుధీర్‌ను బుధవారం సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు డిమాండ్‌ విధించినట్లు పోలీసుల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement