సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం | - | Sakshi
Sakshi News home page

సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

● మాజీ జేడీ లక్ష్మీనారాయణ ● తిరుపతిలో ‘రెసోనెన్స్‌ ఫౌండేషన్‌ సెంటర్‌’ ప్రారంభం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి సోపానం అని మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మినారాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ–జేఈఈ, నీట్‌ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్‌ విద్యాసంస్థలు ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డులో ఉన్న హోటల్‌ ఇష్టా వేదికగా ఏర్పాటు చేసిన ‘రెసోనెన్స్‌ ఫౌండేషన్‌ సెంటర్‌’ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఫౌండేషన్‌ కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్‌ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్‌ కోర్సులు వారానికి మూడు రోజులు నిర్వహించబడతాయని, ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాల్లో అందుబాటులో కలవని చెప్పారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచి మెదడు చురుగ్గా ఉండేందుకు మరో ఐదు రకాల చిట్కాలను సోదోహరణంగా వివరించారు. రెసోనెన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెనన్స్‌ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్‌ సెంటర్‌ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ–జేఈఈ, నీట్‌, ఒలింపియాడ్స్‌ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వ్యాప్తంగా 50 పైగా క్యాంపస్‌లతో విజయవంతంగా దూసుకుపోతోందన్నారు. మరింత సమాచారానికి 9959154371, 9985310069 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement