ఒంటరి మహిళ ఇల్లు కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళ ఇల్లు కూల్చివేత

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

● నరకంగా మారిన గ్రామీణ రోడ్లు ● మట్టి, గ్రావెల్‌తో గుంతలు పూడ్చి చేతులెత్తేసిన అధికారులు ● అరకొర బాగుచేసి డప్పుకొట్టుకుంటున్న కూటమి నేతలు ● ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన పచ్చి నిజాలు – 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

తిరుపతిలో అధికార పాఈర్ట నేతలు చెలరేగి పోతున్నారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఒంటరి మహిళ ఇంటిని కూల్చివేయించారు.
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ఏర్పేడులో నాలుగు కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని ఓ టీడీపీ నాయకుడు కబ్జాకు యత్నించాడు.

బాబూ.. రెండేళ్లయ్యింది.. రోడ్లెప్పుడేస్తారు?

తిరుపతి జిల్లాల్లో అభివృద్ధికి నోచుకోని రహదారులు

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026

‘మేం అధికారంలోకి వచ్చిన ఏడాదికే రహదారులన్నీ బాగుచేస్తాం. అతుకులు..గతుకులు లేకుండా అద్దాల్లా తీర్చిదిద్దుతాం. ఊరికి చుట్టాలొచ్చినప్పుడు వారు మెచ్చుకునేలా మార్చేస్తాం’ అంటూ కూటమి పార్టీ నేతలు జబ్బలు చరిచారు. మమ్మల్ని నమ్మండంటూ ఊదరగొట్టారు. తీరా ఏడాదికాదు.. రెండేళ్లు కావస్తున్నా ఎక్కడి గుంతలు అక్కడే వదిలేశారు. గత ఏడాది పండక్కి అక్కడక్కడా రోడ్లేసినట్టు బిల్డప్‌ ఇచ్చి నిధులు పంచుకుతిన్నారు. ఆ తర్వాత మరమ్మతులు కూడా చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అతుకులు.. గతుకుల రోడ్లపై ప్రయాణం చేయలేక వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన రోడ్ల దుస్థితిపై ప్రత్యేక కథనం..

శ్రీకాళహస్తి– తడ మార్గంలోని చిద్రమైన ఆర్‌అండ్‌బి రోడ్డు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రెండేళ్లైంది.. రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారు సీఎం చంద్రబాబు సారూ’.. అంటూ జిల్లా ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తిరుపతి జిల్లాలో అనేక రోడ్లు ఆధ్వానంగా మారినా పట్టించుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన తరువాత 2025 సంక్రాంతి పండుగకు రోడ్లన్నీ బాగు చేస్తామని గొప్పలు ప్రకటించారని.. ఆ తర్వాత అక్కడక్కడా తూతూమంత్రంగా నాసిరకం రోడ్లేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. చాలా చోట్ల రాళ్లు, మట్టి, గ్రావెల్‌ పోసి ప్రజల కళ్లకు గంతలు కట్టారని రగిలిపోతున్నారు. అవి కొద్దిరోజులకే మళ్లీ యథాస్థితికి చేరాయని పేర్కొంటున్నారు. 2027 సంక్రాంతి వస్తున్నా ఇప్పటికీ రహదారులు బాగు చేసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరం, రూరల్‌ పరిధిలో ఎక్కువగా గులకరాయి పొడితో గుంతలను కప్పేశారు. ఆ పొడి కూడా కొద్ది రోజులకు కొట్టుకుపోయింది. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. మరికొన్ని చోట్ల అయితే నాసిరకమైన కంకర, చిప్స్‌ కలిపి గుంతలను కప్పిపెట్టారు.

నరకదారులు

తిరపతి జిల్లా పరిధిలోని గ్రామీణ రహదారులు మరీ అధ్వానంగా మారాయి. వెంకటగిరి– బాలాయపల్లి మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. గమ్యస్థానాలకు చేరేంత వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు పరిధిలోని రహదారులు గుంతలమయంగా మారాయి. చిన్నపాటి వర్షం వస్తే నీరు నిలిచి బురద గుంతలుగా మారిపోతున్నాయి. మేనకూరు సెజ్‌ పరిసర ప్రాంతాల్లో అయితే రహదారులు మరీ అధ్వానంగా మారాయి. ఇలాంటి రహదారులు చూస్తే పారిశ్రామిక వేత్తలు ఎలా పెట్టుబడులు పెడుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు దుస్థితికి చేరాయి. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని రహదారులు అత్యంత దారుణంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారుల ఏర్పాటు కోసం కంకర తోలి అలాగే వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. పుత్తూరు మండలం, తడుకు వయా గూళూరు, పొట్టిగుట్టలు, శిరుగురాజుపాళెం రహదారులు దారుణంగా అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. తిరుపతి–రైల్వేకోడూరు రహదారిలో పలు చోట్ల గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement