తిరుపతి అర్బన్: శెట్టిపల్లిలో అర్హులందరికీ న్యాయం చేయాలని భూ బాధితుల కమిటీ అధ్యక్షుడు జి.చిన్నబాబు డిమాండ్ చేశారు. బుధవారం శెట్టిపల్లికి చెందిన పలువురు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన తమకు వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.387,388,402,403,409,410,411,425,426,475 పరిధిలో 450 కుటుంబాలకు చెందిన వారు 2008లోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణా లు చేపట్టారని గుర్తుచేశారు. అయితే ఆ కుటుంబా లకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామాంజుల నాయక్‌కు వినతిపత్రాన్ని అందించారు. శెట్టిపల్లి భూ బాధితుల కమిటీ నాయకులు పాల్గొన్నారు.


