సత్యవేడు: చెదులపాకం(తమిళనాడు)కు చెందిన ఎస్.నాగరాజు అనే వ్యక్తిని కత్తితో బెదిరించి 3 గ్రాములు ఉంగరం దోచుకున్న కేసులో సత్యవేడుకు చెందిన సంతోష్(19), నితీష్‌కుమార్(19), నవీన్ కుమార్(16) పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సాయినాథ్ చౌదరి కథనం మేరకు.. తమిళనాడులోని చెదులపాకం గ్రామం నుంచి సత్యవేడు తన స్కూటర్‌పై ఎస్.నాగరాజు వస్తున్నాడు. మాదరపాకం చెక్‌పోస్టు వద్ద సత్యవేడుకు చెందిన సంతోష్ లిఫ్ట్ అడిగాడు. తెలిసిన వ్యక్తి కనుకే తన స్కూటర్‌పై తీసుకుని సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాండ్ వద్దకు వచ్చారు. తన ఇంటి వ ద్దకు వదలి వెళ్లాలని నాగరాజును సంతోష్ కోరాడు. అక్కడి నుంచి బయలు దేరి కొంత దూరం రాగానే తన వద్ద దాచుకున్న కత్తితో ఎస్.నాగరాజును బెరించా డు. గురుకుల పాఠశాల సమీపంలోని జగనన్న కాలనీ వద్దకు పోవాలని చెప్పాడు. అక్కడ వేచి ఉన్న నితీష్ కుమార్, నవీన్‌కుమార్‌తో కలసి నాగరాజును చితక బాదారు. అతని వద్ద ఉన్న 3 గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కున్నారు. డబ్బులు ఇవ్వాల ని కోరారు. తన వద్ద డబ్బులు లేదంటే ఫోన్‌ఫే చేయా లని కోరారు. నెట్‌వర్క్ అందక ఫోన్‌పే జరగలేదు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫోన్ పే నంబర్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. నిందితులను మంగళవారం కోర్టుకు హాజరు పరిచి, రిమాండుకు తరలిచారని ఎస్‌ఐ తెలిపారు.


