వర్సిటీ సిబ్బందికి నిబంధనలు అడ్డురాలేదు.. అక్రమాలను ఆపాల్సిన ఉన్నతాధికారులు ఉదాశీనంగా ఉన్నారు.. ప్రశ్నించేవారు ఎదురుపడలేదు.. ఇకేముంది నకిలీ చలానాలను కంప్యూటర్‌లో మార్ఫింగ్‌ చేశారు.. ఉద్యోగి వెరిఫై సిగ్నేచర్‌ను ఫేక్‌ స్టాంప్‌తో దందా నడిపారు.. రూ.లక్షల్లో న | - | Sakshi
Sakshi News home page

వర్సిటీ సిబ్బందికి నిబంధనలు అడ్డురాలేదు.. అక్రమాలను ఆపాల్సిన ఉన్నతాధికారులు ఉదాశీనంగా ఉన్నారు.. ప్రశ్నించేవారు ఎదురుపడలేదు.. ఇకేముంది నకిలీ చలానాలను కంప్యూటర్‌లో మార్ఫింగ్‌ చేశారు.. ఉద్యోగి వెరిఫై సిగ్నేచర్‌ను ఫేక్‌ స్టాంప్‌తో దందా నడిపారు.. రూ.లక్షల్లో న

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

● వర్సిటీలో కుంభకోణం ● చలానాలను మార్ఫింగ్‌ ● ఫీజులు స్వాహా చేసి..వర్సిటీకి శఠగోపం

న్యూస్‌రీల్‌

ఉలిక్కిపడ్డ ఎస్వీయూ!

బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026

తిరుపతి సిటీ: ఎస్వీయూలో పాలన అస్తవ్యస్థంగా మారింది. రెండేళ్ల నుంచి వర్సిటీలో ఏమి జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. రాజకీయ జోక్యాలు, అవినీతి, కుంభకోణాలు, ఫలితాల విడుదలలో జాప్యం తదితర ఘటనలతో నిత్యం వార్తలలో కెక్కుతుండడంతో వర్సిటీ పరువు, ప్రతిష్ట దిగజారుతోందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హత లేని వారిని సైతం పరిపాలనా భవనంలోని పలు కీలక విభాగాలల్లోకి గత రెండేళ్లలో అధికారులు, నాన్‌టీచింగ్‌ సిబ్బందిని బదిలీ లు చేశారు. దీంతో అవినీతికి మరింత ఆజ్యం పోసినట్లైంది.

భారీ కుంభకోణం బట్టబయలు

వర్సిటీలో మంగళవారం భారీ కుంభకోణం బయటపడింది. విద్యార్థులు యూజీ, పీజీ తదితర ధ్రువపత్రాల కోసం వర్సిటీకి రూ.వేల ఫీజులు చెల్లిస్తుంటారు. విద్యార్థులు చెల్లించిన బ్యాంకు చలానాలను పరిపాలనా భవనంలోని పలు విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు, అధికారులు, బయటి వ్యక్తులతో కలసి డూప్లికేట్‌ చలానాలను కంప్యూటర్‌లో మార్ఫింగ్‌ చేసి, సొమ్ము కాజేసిన ఘటన బయటపడింది. దీంతో ఒక సారిగా వర్సిటీ ఉలిక్కిపడింది. పరిపాలనా భవనంలోని పలు సెక్షన్లలో గందరగోళం నెలకొంది. కొందరు ఉద్యోగులు, బయట వ్యక్తులు కలసి వర్సిటీ రబ్బరు స్టాంపులను సైతం ఫోర్జరీ చేసి కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో లా, ఎంబీఏ విభాగాలకు చెందిన చలానాలు అధిక మొత్తంలో ఉన్నట్లు సమాచారం. రూ. లక్షల్లో సొమ్ము కాజేసి వర్సిటీకి శఠగోపం పెట్టినట్లు వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరింత లోతుగా విచారణ చేపడితేగాని అసలు బండారం బయట పడదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

వర్సిటీకి నష్టం కలిగిస్తే సహించం

ఎస్వీయూలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్‌ పనిచేస్తుంది. కానీ కొందరు ఉద్యోగులు వర్సిటీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తే అసోసియేషన్‌ ఎట్టి పరిస్థితిలో సహించదు. డూప్లికేట్‌ చలానాలను తయారు చేసిన వ్యవహారంలో కొందరు ఉద్యోగులు, బయట వ్యక్తులు, విద్యార్థి నాయకులు ఉన్నట్లు తెలిసింది. ఓ మహిళా ఉద్యోగి వెరిఫై సిగ్నేచర్‌ను ఫేక్‌ స్టాంప్‌ తయారు చేసి దందా నడిపారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నాన్‌టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా పరిగణిస్తుంది. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. వాస్తవాలు బయటకి రావాలంటే మరింత లోతైన విచారణ చేపట్టాలని అధికారులను కోరుతున్నాం. – శ్రీధర్‌, సుబ్రమణ్యం, నాన్‌టీచింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, అధ్యక్ష,కార్యదర్శులు

Advertisement
 
Advertisement
Advertisement