హిందీ పరీక్షకు 72 శాతం మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

హిందీ పరీక్షకు 72 శాతం మంది గైర్హాజరు

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

తిరుపతి అర్బన్‌: పదో తరగతి సప్లిమెంటరీ హిందీ పరీక్షకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 72 శాతం మంది విద్యార్థులు గైర్హాజరు కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 28 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసినట్లు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ వెల్లడించారు. 236 మంది విద్యార్థులకు 67 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 332 మంది విద్యార్థులకు 292 మంది హాజరయ్యారని తెలిపారు. 40 మంది విద్యార్థులు గైర్హాజరు హాజరయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షకు సంబంధించి 130 మంది విద్యార్థులకు 109 మంది హాజరయ్యారని చెప్పారు.

ఇంటర్‌ సప్లిమెంటరీకి 93.93 శాతం..

తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మంగళవారం 93.93 శాతం మంది హాజరయ్యారని ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఫస్ట్‌ ఇయర్‌ బయాలజీతో పాటు బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌1బీ, జూవాలజీ పరీక్షకు 2,703 మంది హాజరుకావాల్సి ఉండగా 2,539మంది హాజరయ్యారని వెల్లడించారు. దీంతో 93.93 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సెకండ్‌ ఇయర్‌ జువాలజీ, ఎకనామిక్స్‌ పరీక్షకు 1,707 మందికి గాను 1,532మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. బక్రీద్‌ కారణంగా గురువారం జరగాల్సిన ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఫస్ట్‌ ఇయర్‌ ఫిజిక్స్‌, సెకండ్‌ ఇయర్‌ కామర్స్‌, సోషియాలజీ పరీక్షలు యధావిథిగా జరుగుతాయని తెలిపారు.

భూసేకరణ వేగవంతం చేయండి

తిరుపతి అర్బన్‌: రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులతో కలసి మంగళవారం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు చెందిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు దశల వారీగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి వారం పనుల్లో పురోగతి చూపాలన్నారు. అధికారుల సమన్వయంతో ముందడుగు వేస్తేనే విజయవంతంగా ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో రైల్వే ప్రాజెక్టు అధికారి వామనమూర్తి, సదరన్‌ రైల్వే అధికారి శశిభూషణ్‌, తిరుపతి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయభరత్‌రెడ్డి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement