ఎడ్‌సెట్‌లో ఎస్వీయూ విద్యార్థికి పదో ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎడ్‌సెట్‌లో ఎస్వీయూ విద్యార్థికి పదో ర్యాంక్‌

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌–2026 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. తిరుపతి రూరల్‌, పేరూరు తారకరామ నగర్‌కు చెందిన ఎస్వీయూ విద్యార్థి సి కుష్వంత్‌ ఇంగ్లిష్‌ మెథడాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 115 మార్కులు సాధించి పదో ర్యాంకు కై వసం చేసుకున్నాడు. విద్యార్థి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ ఇంగ్లిష్‌, ఎస్వీయూలో ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ ఇంగ్లిష్‌లో తాను పీహెచ్‌డీ చేయాలన్నదే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 89,399 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,985 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement