ఒక నాటకం సందర్భంగా శివప్రసాద్‌కి హీరో వేషం, చంద్రబాబుకి కమెడియన్ వేషం ఇచ్చారు. కానీ అధ్యాపకుడికి చంద్రబాబు వేరుశనగ కాయల మూట లంచంగా ఇచ్చి తనకు రావాల్సిన హీరో వేషం కొట్టేశాడని చెప్పాడు. 1968 ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన చంద్రబాబాబు నైజాన్ని సూచిస్తోంది. ఇక్కడ మరో గమ్మత్తేమంటే, చంద్రబాబు లంచంగా ఇచ్చిన ఆ వేరుశనగ కాయలు కూడా పక్క పొలంలో కాజేసినవే.
తిరుపతిలో అప్పులు చేసి తప్పించుకుని తిరిగేవాడు పరామర్శకు వెళ్లిన తమ్ముడినే దూషించాడు
1974లో నేను రాడికల్ విద్యార్థి సంఘంలో కీలకంగా వ్యవహరించే సందర్భంలో ఉద్యమం కోసం ఫండ్ రైజ్ చేయాలని నిర్ణయించాం. అందుకోసం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చక్రపాణి అనే చిత్రం తిరుపతిలోని రామరాజు థియేటర్‌లో ప్రదర్శించాలనుకుని దానికి రూ.2 టికెట్ ధర నిర్ణయించాం. టికెట్ అమ్మే పనిలో భాగంగా రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న చంద్రబాబు గదికి నా స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి వెళ్లడం జరిగింది. చంద్రబాబుని డబ్బులడిగితే తన జేబులో ఉన్నవి ఇవ్వకుండా గదిలో నిద్రపోతున్న తన స్నేహితుడి జేబులో నుంచి డబ్బులు దొంగిలించి ఇచ్చాడు.
జయచంద్రనాయుడు ఆ రోజుల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే వారు. ఆయన కింద చంద్రబాబు జిల్లా సెక్రటరీగా ఉండేవాడు. జయచంద్రనాయుడికి రూమ్ ఉంటే చంద్రబాబు తన ఖర్చులు కూడా ఆయన పేరు మీదనే రాసేసేవాడు.
తిరుపతి బాలాజీ కాలనీలో చలమయ్యగారికి ఒక పాన్ షాప్ ఉండేది. ఆయన వద్ద 1975 కాలంలోనే రూ.200 అప్పు చేసిన చంద్రబాబు, ఆ తర్వాత దొరక్కుండా తప్పించుకుని తిరిగేవాడు.
చంద్రబాబు మంత్రి అయ్యాక కట్టిన విష్ణుప్రియ హోటల్ నిర్మాణానికి కలప తీసుకొచ్చి దానికి డబ్బులు ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబు.
అన్నపై నక్స్‌లైట్ల దాడి జరిగిందని తెలిసి పరామర్శకు వెళ్లిన తమ్ముడు రామ్మూర్తినాయుడిని పచ్చి బూతులు తిట్టి అవమానించాడని నాతో చెప్పుకుని బాధపడ్డాడు. అది నిజం కాదు అని చెప్పే దమ్ము చంద్రబాబుకి ఉందా? పైగా తనను తిట్టి, అందుకు పూర్తి విరుద్ధంగా తానే అన్నను తిట్టినట్లు అమ్మకి చెప్పాడని స్వయంగా రామ్మూర్తినాయుడు నా వద్ద కన్నీరు పెట్టుకున్నాడు.
1977 పార్లమెంట్ ఎన్నికల్లో రాజగోపాల్‌నాయు డు చిత్తూరు నుంచి పోటీ చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం చంద్రబాబు కు ఒక జీపు ఒక డీజిల్ క్యాన్ అప్పగించారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి తిరగకుండా ఇచ్చిన డీజిల్‌ని వారి పెట్రోల్ బంకులోనే అమ్మేసి డీజిల్ అయిపోయిందని మళ్లీ వెళ్లాడు. ఈ విష యం రాజగోపాల్‌నాయుడు స్వయంగా చెప్పారు.
దివంగత మాజీ మంత్రి ఎన్.శివప్రసాద్, నేను మంచి స్నేహితులం. నేను వైఎస్సార్ యువసేన పెట్టినప్పుడు అందులో ఆయన సభ్యుడిగా ఉండేవారు. అదే శివప్రసాద్, చంద్రబాబుకి చిన్ననాటి స్నేహితుడు. ఆ శివప్రసాద్‌ను 1996 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని నేను, వైఎస్సార్ నాడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు ద్వారా తీవ్రంగా ప్రయత్నించాం. విద్యార్థిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉండేవాడో శివప్రసాద్ చెప్పిన ఒక సంఘటన అందర్నీ విస్మయానికి గురి చేస్తుంది.
ప్రతి అర్జీని పరిశీలించండి
తిరుపతి అర్బన్: ప్రతి అర్జీని అధికారులు నిశితంగా పరిశీలించి, సంబంధిత సమస్యను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్‌మాండ్, శివశంకర్ నాయక్, భరత్ నాయక్ 423 అర్జీలను అందుకున్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై 246 అర్జీలు, పింఛన్ల కోసం 24 అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ ప్రతి అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే అర్జీదారుడికి సమాచారం స్పష్టంగా చెప్పాలన్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెప్పారు.
గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి
దేశసమైక్యత సమగ్రతకు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జమాత్ ఏ ముస్లిమిన్ నేతలు కోరారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులుకు వినతి పత్రం అందజేశారు. జమాత్ ఏ ముస్లిమిన్ నేతలు రఫీతోపాటు పలువురు పాల్గొన్నారు.
మా కుటుంబాలను ఆదుకోండి సార్
పెనగలూరు మండలం వెలగచెర్ల చెరువుకట్ట వద్ద జరి గిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పెంచలయ్య, వెంకటయ్య కుటుంబాలతోపాటు గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కూలీలు సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
స్నేహితుడి జేబు కొట్టేసిన చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: విద్యార్థి దశ నుంచే చోరీలు చేయడం, మాయమాటలు చెప్పడం అలవాటైన చంద్రబాబు గొప్ప ప్రజా నాయకుడని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి చంద్రబాబు నీతిమాలిన చేష్టలను భూమన తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
తాను దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టు చంద్రబాబు నీతులు చెబుతున్నాడు. కానీ ఆయన గతం తెలిసిన వారు ఛీ కొట్టకుండా ఉండలేరు.
ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్ వంశీ, పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఇరగం అనిల్ రెడ్డి, పార్టీ నాయకుడు అరుణ్ యాదవ్ పాల్గొన్నారు.


