– 8లో
– 8లో
దళితుల నిరసన
తమ అనుభవంలోని భూమికి మరొకరికి పట్టా లు ఇచ్చారని, వాటిని రద్దు చేసి తమకు ఇవ్వాల ని ఎస్టీ కాలనీ దళితులు కోరారు.
●
తిరుపతి రూరల్: శెట్టిపల్లి పరిసరాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారందరికీ న్యాయం చేస్తామని గత ప్రభుత్వంలో అధికారులు జీ.ఓ 173ని తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు న్యాయం చేయకపోవడంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆకస్మికంగా వంద మందికిపైగా బాధితులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కార్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేత వందవాసి నాగరాజు మాట్లాడుతూ శెట్టిపల్లి వద్ద స్థలాలు కొన్న వారందరికీ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇకపై తిరుపతి వచ్చే సీఎం, మంత్రుల పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తామని హెచ్చరించారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ రామమోహన్ అందుబాటులో లేనందున ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఝాన్సీకి వినతిపత్రం అందజేశారు.
నోటిఫికేషన్‌లో పేరున్నా
కుదరదంటున్నారు!
శెట్టిపల్లి రైతులకు న్యాయం చేసేటపుడు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరికీ న్యాయం చేస్తామని, అందరికీ ఎలా ప్లాట్లు కేటాయింపులు జరుగుతాయో.. మీకు కూడా అలాగే చేస్తామని అప్పటి అధికారులు మాట ఇచ్చారు. గత ప్రభుత్వం మా అందరి పేర్లును నోటిఫికేషన్‌లో పొందు పరచి మాకు ధైర్యం కలిగించింది. ఈ ప్రభుత్వంలో అంతా అయిపోయిందని చెప్పి మీకు సాయం చేయడం కుదరదంటున్నారు. ఇదెక్కడి న్యాయం. –మస్తానయ్య, బాధితుడు
పుస్తెలు అమ్ముకుని ప్లాటు కొన్నా..
కూలి పనులు చేసుకుని బతుకుతున్న నాకు 2006లో అక్కడ తక్కువ ధరకు ప్లాటు వస్తుందంటే ఆశపడి మెడలోని పుస్తెలు అమ్ముకుని కొనుగోలు చేశా. ఆ ప్లాటు రిజిస్ట్రేషన్ సమయంలో కూడా డబ్బులు చాలకుంటే ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి చేసుకున్నా. ఇప్పుడు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ తప్పు అంటున్నారు. అలాంటప్పుడు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మాలాంటి పేదల కడుపుల్లో మంట రగల్చిన అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.
– కుసుమకుమారి, బాధితురాలు


